Event-Date 29-09-2019
State Andhra Pradesh
Topic Awards And Honours
ఏపీకి నాలుగు పర్యాటక అవార్డులు
Four Tourism Awards for AP

  • అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ అవార్డులను ప్రకటించింది.
  • పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు లభించాయి.
  • పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి విభాగంలో ఏపీకి జాతీయ ఉత్తమ రాష్ట్రం అవార్డు లభించింది.
  • పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారంతో పర్యాటకుల హృదయాలను హత్తుకునే విధంగా ముద్రణ విభాగంలో రాష్ట్రానికి అవార్డు దక్కింది.
  • ప్రయాణికుల భద్రత, సేవారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు స్నేహపూర్వక రైల్వే స్టేషన్‌గా అవార్డు దక్కింది.
  • నాలుగు నక్షత్రాల హోటల్ విభాగంలో విజయవాడలోని క్వాలిటీ హోటల్ డి.వి.మానర్ అవార్డు పొందింది.
  • ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉత్తమ రాష్ట్రం అవార్డును స్వీకరించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.