హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యాడు.
సెప్టెంబర్ 27న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌పై అజహరుద్దీన్ విజయం సాధించాడు.
మరోవైపు హెచ్‌సీఏ ఉపాధ్యక్షునిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, కోశాధికారిగా సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ, సంయుక్త కార్యదర్శిగా నరేశ్ శర్మ ఎన్నికయ్యారు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సిఫారసుల అనంతరం తొలిసారి అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
ఏసీఏ అధ్యక్షుడిగా శరత్‌చంద్రా
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా పి.శరత్‌చంద్రా రెడ్డి సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించారు.
ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్రరావు, కోశాధికారిగా జి.గోపినాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా ఆర్.ధనుంజయరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు.