ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల పోల్‌వాల్ట్‌లో కొత్త చాంపియన్ అవతరించింది.
ఆథరైజ్ న్యూట్రల్ అథ్లెట్ (ఏఎన్ఏ) తరఫున బరిలోకి దిగిన రష్యా అథ్లెట్ ఏంజెలికా సిదొరోవా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఈవెంట్లో చివరగా 4.95మీ. ఎత్తున్న బార్‌ను లంఘించడంలో విజయవంతమైన సిదోరోవా చాంపియన్‌గా నిలిచింది.
చివరి వరకు పోరాడిన అమెరికా అమ్మాయి సాండీ మోరిస్ వరుసగా రెండోసారి రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది.
బ్రిటన్‌కు చెందిన కాటరీనా స్టెఫానిది మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. 2017 లండన్ క్రీడల్లోనూ సాండీ రన్నరప్‌గా నిలిచింది.