Event-Date 02-10-2019
State National
Topic Places In News
సిక్కింలో అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణం
Sikkim to get world's second highest motorable road by Oct 2021

  • సిక్కింలోని కెరంగ్-జొడాంగ్‌ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
  • 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌ఓ) అక్టోబర్ 1న తెలిపింది.
  • ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా ఇది నిలుస్తుంది.
  • ఈ ప్రాజెక్టుకు 2015లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • కెరంగ్-జొడాంగ్ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని బీఆర్‌ఓ పేర్కొంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.