Event-Date 02-10-2019
State International
Topic Sports And Games
ప్రపంచ హైజంప్‌లో మరియాకి స్వర్ణం
Maria Lasitskene

  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల హైజంప్‌లో రష్యా అథ్లెట్ మరియా లసిట్స్‌కిని స్వర్ణ పతకం సాధించింది.
  • ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబ‌ర్ 30న జరిగిన మహిళల హైజంప్ ఫైనల్లో మరియా 2.04 మీ. ఎత్తు దూకి పసిడిని కైవసం చేసుకుంది. 
  • యరోస్లెవా మహుచిక్ (ఉక్రెయిన్) రజతం.. వాష్టి కున్నిగమ్ (అమెరికా) కాంస్యం అందుకున్నారు.
  • 26 ఏళ్ల లసిట్స్‌కిని 2015, 2017 టోర్నీల్లోనూ స్వర్ణాలను గెలుచుకుంది.
  • డోపింగ్ కారణంగా ప్రస్తుతం రష్యాపై నిషేధం ఉండడంతో ఆ దేశ అథ్లెట్లు ప్రపంచ టోర్నీలో తటస్థ అథ్లెట్లుగా పోటీపడుతున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.