Event-Date 03-10-2019
State International
Topic Law And Order
భారత్‌కే నిజాం నిధులు: యూకే హైకోర్టు
The UK High Court rules in the favour of India in Hyderabad

  • 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది.
  • ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు అక్టోబర్ 2న తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది.
  • 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1,007,940 పౌండ్ల(ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ.8.82 కోట్ల పైచిలుకు) మొత్తాన్ని బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేశారు.
  • ఇప్పటికి అవి వడ్డీతో కలిపి దాదాపు 35 మిలియన్ పౌండ్ల(రూ. 306.5 కోట్లు)కు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు.
  • నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు... ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’ అని తాజగా తీర్పును వెలువరించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.