Event-Date 06-10-2019
State International
Topic Sports And Games
టీ20లో మహ్మద్‌ హస్నేన్‌ ప్రపంచ రికార్డు
Pakistan teenager Mohammad Hasnain creates world record in T20

  • లాహోర్‌ వేదికగా పాక్‌ X శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ జట్టుకు చెందిన పందొమ్మిదేళ్ల యువకుడు మహ్మద్‌ హస్నేన్‌ ఆడిన రెండో టీ20లోనే హ్యాట్రిక్‌ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.  
  • మొదట బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఈ సందర్భంగా పాక్‌ యువ బౌలర్‌ మహ్మద్‌ నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.
  • టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన పిన్న వయస్కుడిగా(19 ఏళ్ల 183 రోజులు) చరిత్ర సృష్టించాడు. 
  • ట్వంటీ 20(T 20) 2003వ సంవత్సరంలో వృత్తిపరమైన అంతర దేశీయ క్రికెట్ పోటీ జరపడం కోసం ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ECB ) ద్వారా ప్రవేశ పెట్టబడింది.
  • ట్వంటీ 20 ఆటలో రెండు బృందాలు ఉంటాయి.  ఒక్కో ఇన్నింగ్ 75 నిముషాల చొప్పున ఉంటుంది. ఒక ట్వంటీ20 ఆట కేవలం మూడున్నర గంటలలో అయిపోతుంది. 
  • 2007 సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికాలో ICC ప్రపంచ ట్వంటీ 20 ప్రారంభించబడింది.
  • మొట్టమొదటి అధికారిక ట్వంటీ20 ఆటలు 2003 జూన్ 13వ తేదిన ట్వంటీ 20 కప్ కోసం ఇంగ్లిష్ దేశాల మధ్యన జరిగాయి.
     

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.