Event-Date 06-10-2019
State Telangana
Topic Conferences And Meetings
ఐయూఎఫ్‌ఆర్‌వోలో తెలంగాణ ఏపీసీసీఎఫ్
Haritha Haram highlighted at IUFRO World Congress

  • బ్రెజిల్‌లోని క్యూరీటుబాలో జరుగుతున్న 25వ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఐయూఎఫ్‌ఆర్‌వో) సమావేశంలో అక్టోబర్ 4న తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(ఏపీసీసీఎఫ్) లోకేశ్ జైస్వాల్ పాల్గొన్నారు.
  • తెలంగాణలో పచ్చదనం పెంచేందుకు, అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి ఈ సమావేశంలో లోకేశ్ వివరించారు.
  • సిద్దిపేట జిల్లాలోని ‘గజ్వేల్-ములుగు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించారు.
  • 2019, సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశాలు అక్టోబర్ 5న ముగియనున్నాయి.
  • ఈ సమావేశాల్లో 110 దేశాల్లో విధాన రూపకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలతో కూడిన ప్రపంచ నెట్‌వర్క్, భాగస్వామ్యపక్షాలు పాల్గొన్నాయి.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.