Event-Date 07-10-2019
State Andhra Pradesh
Topic Govt Schemes And Programmes
ఏపీలో వైఎస్సార్ వాహనమిత్ర ప్రారంభం
AP YSR Vahana Mitra Scheme

  • ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4న ప్రారంభించారు.
  • ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. 
  • ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘2018 మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని అమలు చేశాం. వారి కష్టాలను స్వయంగా చూసి ఈ పథకాన్ని రూపొందించాం’ అని తెలిపారు. వాహనమిత్ర ద్వారా 1,73,531 మందికి లబ్ధి చేకూరనుంది.
  • ప్రతి ఏడాది అమలవుతుందన్న సీఎం ప్రతి పేద సొంత వాహనదారుడికి ఐదేళ్లల్లో రూ.50 వేలు అందుతాయన్నారు.
  • రాష్ట్రంలోని ఒక లక్షా 75 వేల మంది వాహనదారులకు ఈ సహాయం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.