Event-Date 07-09-2019
State Telangana
Topic Awards And Honours
ఇక్రిశాట్ డెరైక్టర్‌కు జయశంకర్ పురస్కారం
Jayashankar Award for icrisat Director

  ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డెరైక్టర్ రాజీవ్ కె.వర్షిణికి ప్రొఫెసర్ జయశంకర్ లైఫ్‌టైమ్ పురస్కారం లభించింది. 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా వర్షిణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పరిస్థితులకు అనువైన కొత్త వంగడాల రూపకల్పనపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.