Event-Date 09-10-2019
State National
Topic Defence And Security
సైనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
Rajnath Singh agreed to a fourfold increase in the financial assistance to the families of soldiers

  • సైన్యంలో సేవలందిస్తూ అమరులైనవారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 5న సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.
  • ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారు. 
  •  యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
  • ‘సైనిక యుద్ధవీరుల సంక్షేమ నిధి’ (ఏబీసీడబ్ల్యూఎఫ్‌) నుంచి దీనిని అందజేయనున్నారు. 
  • సరళీకృత కుటుంబ పింఛను, సైనిక బృంద బీమా పథకం కింద లభించే పరిహారం (రూ.40 లక్షల నుంచి రూ.75 లక్షలు), ఎక్స్‌గ్రేషియా (రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షలు), సైనిక సంక్షేమ నిధి మొత్తాలకు ఇది అదనం

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.