Event-Date 13-10-2019
State International
Topic Places In News
ప్రపంచ సంపన్న నగరంగా న్యూయార్క్
New York City ranked wealthiest in the world

  • మరో దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అత్యంత సంపన్న నగరంగా అవతరించనుంది.
  • విశ్వవ్యాప్తంగా సంపన్న నగరాల జాబితాలో ర్యాంక్ సాధించి గ్రేటర్ సిటీ బాద్‌షా కానుందని నైట్‌ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
  • దేశంలో ఫార్మా రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, రియల్టీ రంగాలు శరవేగంగా పురోగమిస్తుండటంతో పలు దిగ్గజ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది.
  • ప్రపంచ సంపన్న నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ 3 ట్రిలియన్ డాలర్ల సంపదతో అగ్రభాగాన నిలవగా.. మన దేశ వాణిజ్య రాజధాని ముంబై 0.96 ట్రిలియన్ డాలర్ల సంపదతో 12వ ర్యాంక్ సాధించడం విశేషం.
  • పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఢిల్లీ, బెంగళూరు సైతం రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక తెలిపింది. సుమారు 90 దేశాల్లోని 100 నగరాల్లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేసి టాప్-20 సంపన్న నగరాల జాబితాను ఈ నివేదిక ప్రకటించింది.

టాప్-5 సంపన్న నగరాలివే..
1. న్యూయార్క్(3 ట్రి.డా.)
2. టోక్యో(2.50 ట్రి.డా.)
3. శాన్‌ఫ్రాన్సిస్‌కో(2.40 ట్రి.డా.)
4. లండన్(2.40 ట్రి.డా.)
5. బీజింగ్(2.10 ట్రి.డా.) (సంపద ట్రిలియన్ డాలర్లలో)

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.