ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు, పారిశుధ్య నిర్వహణ, వ్యర్ధ పదార్థాల ఏరివేత, వైరస్ రోగాల నివారణ, అదనపు తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డులు అందచేసింది.
అందులో భాగంగా తెలంగాణకు నాలుగు అవార్డులు, ఆంధ్రపదేశ్కి రెండు దక్కినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్ హబిచువేట్ సెంటర్ జరిగిన కార్యక్రమంలో అవార్డులను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అందజేశారు.
జిల్లా ఆస్పత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి మొదటి స్థానం వచ్చింది. సంగారెడ్డి, కొండాపూర్ జిల్లా ఆస్పత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
పీహెచ్సీ-సీహెచ్సీల విభాగంలో పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ స్థానం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా ఆస్పత్రుల విభాగంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రాగా, పీహెచ్సీ-సీహెచ్సీల విభాగంలో రాజోలు కమ్యూనిటీ సెంటర్ వచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.