Event-Date 13-10-2019
State International
Topic Awards And Honours
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
Vice President Naidu conferred with highest Civilian Honour of Comoros

  • ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు  అరుదైన గౌరవం లభించింది.
  • అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ ప్రకటించిది. 
  • కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అక్టోబర్ 11న అందుకున్నారు.
  • ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
  •  భారత్‌-కొమొరోస్‌ మైత్రికి గుర్తుగా ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘‘సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది. పరస్పర పురోగతికి స్వప్నమిది’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.