Event-Date 13-10-2019
State International
Topic Awards And Honours
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
Abiy Ahmed Ethiopia prime minister wins 2019 Nobel

  • ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీని నోబెల్ శాంతి పురస్కారం వరించింది. 2019కి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది.
  • అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషికి గానూ ఈ అవార్డును ఇస్తున్నట్లు వెల్లడించింది.
  • అబియ్ అహ్మద్ ముఖ్యంగా తమ పొరుగుదేశాలతో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. 
  • ఇథియోపియా సరిహద్దు దేశం ఎరిత్రియాతో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించడంలో అబియ్ అహ్మద్ కీలక పాత్ర పోషించారు. 
  • అహ్మద్ అలీని సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ ఆయనకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
  • ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 
  • 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత.
  • ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. 
  • ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.