Event-Date 01-01-2020
State International
Topic Places In News
రొమైరాను అధిరోహించిన తొలి మహిళ
She was the first woman to cross Romeira

  • మూడు దేశాల(వెనుజులా, బ్రెజిల్, గయానా) సరిహద్దులో 31 చ.కి.మీ వైశాల్యంలో ఉన్న రొమైరా పర్వతాన్ని బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల అన్నా టేలర్ అధిరోహించింది.
  • దీంతో విష సర్పాలు, సాలె పురుగులు, తేళ్లు, క్రూర జంతువులకు ఆలవాలమైన రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా టేలర్ రికార్డు సృష్టించింది.
  • నిట్టనిలువుగా దాదాపు 1,500 అడుగుల ఎత్తుతో ఉన్న రొమైరా పర్వతాన్ని లియో హోల్డింగ్(39) అనే పర్వాతారోహకుడి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బృందంతో కలసి టేలర్ అధిగమించింది.
  • దట్టమైన కీకారణ్యంలో 33 మైళ్లు నడుచుకుంటూ ప్రమాదకరమైన జలపాతాలు దాటుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు నెల పట్టినట్లు ఈ సాహస బృందం వెల్లడించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.