ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు.
ఈ పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
గ్రాఫీన్ పెచ్చులతో తయారుచేసిన పరకరాల ద్వారా నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు.
నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఎలక్ట్రో కెనైటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్ అనే ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయోచ్చని తెలిపారు.
కాంట్రాస్టింగ్ ఇంటర్ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొన్నారు.