ఎన్ఎంసీ తొలి చైర్మన్గా డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) తొలి చైర్మన్గా ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు.
ఈ మేరకు జనవరి 2న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. ఎన్ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు.
వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో ఎన్ఎంసీను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు.