Event-Date 07-10-2020
State Telangana
Topic Places In News
దక్షిణ భారత దేశంలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌
Hyderabad is the first city in South India to generate electricity from garbage

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు వెలువడే చెత్తను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు గాను రాంకీ సంస్థ 2009లో జీహెచ్‌ఎంసీతో 25 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. రెండు బ్రాయిలర్ లకు గాను ఒక బ్రాయిలర్ మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి రావడంతో కేవలం 10 మెగావాట్ల విద్యుత్‌ ను మాత్రమే ఉత్పతి చేస్తున్నారు. రెండో బాయిలర్‌కూడా వినియోగంలోకి వస్తే 19.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. చెత్తను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌ అని అంటారు. దీనిద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. పర్యావరణహితమైన థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్‌ను రాంకీ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. దాని ద్వారానే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.