16వ వరల్డ్ ఎడ్యూకేషన్ సమ్మిట్ 2020లో బాసర ట్రిపుల్ ఐటీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును దక్కించుకుంది. మెరుగైన విద్యా ప్రమాణాలు కలిగిన 95 కళాశాలలు పాల్గొనగా.. బాసర ఆర్జీయూకేటీ ఈ పురస్కారాన్ని దక్కించుకొంది.
రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శుచిశర్మ, అన్నపూర్ణ కాలేజ్ మీడియా అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అక్కినేని అమల చేతుల మీదుగా ఉపకులపతి అశోక్ పురస్కారాన్ని అందుకొన్నారు.
ఈ సమ్మిట్లో బాసర ట్రిపుల్ ఐటీ నుంచి వ్యవసాయం రంగం, మహిళల భద్రత, రోడ్ల భద్రత లాంటి పలు అంశాల మీద విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఇచ్చారు.