Event-Date 13-10-2020
State Andhra Pradesh
Topic Places In News
రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
international-recognition-rushikonda-beach

విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ని ఈ బీచ్‌ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్‌ ఇంటర్నేషనల్‌ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్‌ ద్వారా పరిశీలించి అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌కును అందచేసింది. బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్‌ బీచెస్‌ ఆఫ్‌ ఇండియా మిషన్‌ లీడర్‌ సంజయ్‌ జల్లా తెలిపారు. 

విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్‌ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్‌ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ని పొందాయి.

  • బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ పొందిన బీచ్‌ 
  • దేశంలో మొత్తం 8 బీచ్‌లు ఎంపిక 
  • తీరం పరిశుభ్రతలో భారత్‌కు మూడో స్థానం

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.