ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు.
‘జగనన్న వసతి దీవెన’పథకాన్ని ఫిబ్రవరి 24న ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు.
ప్రతి ఏటా పేద విద్యార్థులకు వసతి దీవెన ద్వారా రూ.20 వేలు అందించనున్నారు.
రెండు విడతలుగా రూ. 20 వేలు.. వసతి, భోజనం ఖర్చుల కోసం డిగ్రీ, పీజీ చిదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే నేరుగా డబ్బు జమ చేస్తామన్నారు. 1.87 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని.
వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేయనున్నారు
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు.. మొత్తంగా ఏటా రూ.20 వేలు పిల్లల తల్లులకు అందిచనున్నారు
ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు వారి తల్లులకు అందిచనున్నారు.
కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ వసతి దీవెన సాయం అందిస్తారు.
వసతిదీవెన కింద ఏడాదికి రూ.2,300
విద్యాదీవెన పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు ఏడాదికి రూ.3,700 కోట్లు
అమ్మఒడి కింద ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల కోసం రూ.6,400 కోట్లు
ఈ మూడు పథకాలకూ కలిపి ఏడాదికి రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.