Event-Date 26-02-2020
State Andhra Pradesh
Topic Awards And Honours
పోచిరాజు సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Kendra Sahitya Akademi Award for Pochiraju Satyavati

  • విజయవాడకు (ఆంధ్రప్రదేశ్) చెందిన ప్రసిద్ధ కథా రచయిత్రి పి.సత్యవతికి  2019 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • ట్రాన్స్ లేషన్ విభాగంలో ఆమెను ఈ అవార్డు వరించింది. 
  • 2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు తెలిపారు. 
  • 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా అందులో 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్‌ అబౌట్‌ మీ : ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది.
  • పి.సత్యవతి ‘వాటిజ్‌ మై నేమ్‌’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్‌ హీ కమ్‌ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి.
  • 1940లో గుంటూరు జిల్లాలో జన్మించారు.
  • ఆమె తొలి కథ తెలుగు స్వతంత్ర మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, పెద్దిభొట్ల స్మారక పురస్కారంతోపాటు వివిధ సంస్థలు సత్యవతికి అనేక పురస్కారాలు అందించాయి.
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వివిధ భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.
  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో నుండి ఇస్తున్నారు. 
  • తొలి పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా అందజేసే నగదు బహుమతిని ప్రారంభించినప్పుడు రూ.5వేలుగా ఉండగా క్రమంగా ఆ మొత్తాన్ని పెంచారు. 1983లో రూ.10వేలు, 2001లో రూ.40వేలు, 2003లో రూ.50వేలుగా బహుమతి మొత్తాన్ని పెంచారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష చొప్పున బహుమతిని అందజేస్తున్నారు.
  • 1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
  • భాషా సమ్మాన్ పురస్కారం : సాహిత్య అకాడమీ సంస్థ గుర్తించిన ఇతర భాషలలో సాహిత్యసృజన, సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ అనువాద బహుమతి : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో అనువాద రచనలు చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లోని ఉత్తమ బాలసాహిత్యానికి/బాలసాహిత్యానికి సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ యువ పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ప్రకటిస్తారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.