Event-Date 18-10-2020
State International
Topic General
గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్ నివేదిక 94వ స్థానంలో భారత్
global-hunger-index-india-ranks-94-among-107-countries

దేశంలో ఆకలి కేకలు ఇంకా ఆగడం లేదు, పట్టెడన్నం కోసం చిన్నారుల బతుకులు ఇంకా ఆగమైతున్నయ్‌ అని ప్రపంచ దేశాల ఆకలి లెక్కలను చూసే గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ (జీహెచ్​ఐ) విడుదల చేసిన నివేదికలో తేలింది. 107 దేశాల్లో సర్వే జరిపింది. అయితే ఇందులో భారత దేశం 94వ స్థానంలో నిలిచింది. దేశంలో ఇంకా 14శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని తెలిపింది. గతేడాది మన దేశం 102వ ర్యాంక్‌ నుంచి 94వ స్థానానికి చేరుకుంది.  వెల్తుంగర్‌హిల్ఫ్, కన్సర్న్ వరల్డ్‌వైడ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 27.2 స్కోరుతో దేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉంది. ఈ నివేదిక 132 దేశాల పరిస్థితిని అంచనా వేసినప్పటికీ.. 107 దేశాలకు డేటాను విడుదల చేసింది. నేపాల్, బంగ్లాదేశ్ వరుసగా 73, 75 ర్యాంకులను సాధించగా, పాకిస్థాన్‌ 88వ స్థానాల్లో ఉన్నాయి.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.