Event-Date 20-10-2020
State International
Topic Awards And Honours
అమెరికా తెలుగు అమ్మాయికి యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అవార్డు
indian-american-teen-anika-chebrolu-wins-25-000-prize-for-potential-covid-treatment

‘‘టెక్సాస్‌కు చెందిన 14ఏళ్ల భారత సంతతి అమెరికా తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలు.. 2020వ ఏడాదికి గానూ 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అవార్డును గెలుచుకున్నది. క‌రోనా వైర‌స్ చికిత్స కోసం నిర్వ‌హించిన పోటీలో టీనేజ‌ర్ చేబ్రోలు అనిక విజేత‌గా నిలిచింది. ఆ పోటీలో ఆమె 25వేల డాల‌ర్ల బ‌హుమ‌తి గెలుచుకున్న‌ది. ఈ పాఠశాల విద్యార్థిని.. కరోనా వైరస్ ప్రోటీన్‌ను బంధించి దాన్ని నియంత్రించే అణువును రూపొందించడం, ఇందుకుగానూ.. 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని అందుకున్నది. SARS-CoV-2 వైర‌స్‌పై ఉన్న ప్రోటీన్ల‌ను తాను డెవ‌ల‌ప్ చేసిన క‌ణ‌జాలం క‌ట్టిప‌డేస్తుంద‌ని, దీంతో ఆ ప్రోటీన్ ప‌నిత‌నం త‌గ్గిపోతుంద‌ని అనిక చెప్పింది.  చేబ్రోలు అనిక ప్ర‌స్తుతం టెక్సాస్‌లో ఏమిదో గ్రేడ్ చ‌దువుతున్న‌ది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.