Event-Date 20-10-2020
State National
Topic Persons In News
మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన ఘనత
ms-dhoni-1st-player-to-play-200-ipl-games

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ  అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో 200  మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌   ద్వారా ధోనీ ఈ మైలురాయి చేరుకున్నాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మహీ  పుణె(2016,2017సీజన్లలో) తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. 2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచి ధోనీ చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో రైనా 193 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ధోని తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ శర్మ 197 మ్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, కేకేఆర్‌ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ 191 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.   ఐపీఎల్‌లో  ధోని 4,596  పరుగులతో ఉన్నాడు. కాగా, ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 215 సిక్స్‌లు కొట్టగా, గేల్‌(333) తొలి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్‌ 231 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.