Event-Date 20-10-2020
State International
Topic General
అమెరికాలో మన తెలుగు భాషకు గౌరవం
Telugu language recognised as official language in the USA

అమెరికాలో మన తెలుగు భాషకు గౌరవం దక్కింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ప్రజలకు సమాచారం అందించేందుకు అధికారిక భాషగా తెలుగు భాషను గుర్తించింది. త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ సమాచారాన్ని తెలుగు భాషలో కూడా పేర్కొని భారతీయులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపర్ వివిధ భాషల్లో ముద్రిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ సహా కొన్ని భారతీయ భాషలతో పాటు ఓటరు బ్యాలెట్ పేపర్‌లోని అధికారిక భాషల జాబితాలో తెలుగు భాష కూడా చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు 15 కోట్ల దాకా ఉంటారని ఒక అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 9 కోట్ల మంది (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా) తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.