Event-Date 20-10-2020
State International
Topic Sports And Games
2022 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్న బర్మింగ్‌హామ్
Home of the Birmingham 2022 Commonwealth Games

షేడ్యూల్ ప్రకారం 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్-2022 జరగనున్నాయి. పోటీలు ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో 22వ కామన్వెల్త్ గేమ్స్ ను నిర్వహించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి మహిళల టి20 క్రికెట్ నిర్వహిస్తున్నారు. షెడ్యూల్‌లో పోటీల తొలి రోజైన 2022 జూలై 29న మహిళల క్రికెట్ మొదలవుతుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఒకే ఒకసారి క్రికెట్ భాగంగా ఉంది. 1998లో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో వన్డే ఫార్మాట్‌లో జట్లు పోటీ పడ్డాయి. దక్షిణాఫ్రికా స్వర్ణం గెలుచుకుంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.