Event-Date 21-10-2020
State Telangana
Topic General
‘సీఎంఆర్‌ఎఫ్‌’కు మమతాబెనర్జీ రూ.2 కోట్ల విరాళం
mamata-banerjee-donates-rs-2-crore-to-telangana-cmrf

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మంగళవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి భారీగా ఆస్తినష్టం సంభవించింది. చాలామంది పేదలు ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. బాధితులను ఆదుకునేందుకు రూ. 2 కోట్ల విరాళం ఇచ్చారు.  వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రూ.550 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రూ.15 కోట్లు, తమిళనాడు సీఎం రూ.10 కోట్లు, మైహోమ్‌ గ్రూప్‌ రూ.5 కోట్లు ప్రకటించగా.. సినీహీరోలు మహేశ్‌బాబు, చిరంజీవి రూ. కోటి చొప్పున  జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 50లక్షలు విరాళం అందచేశారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.