Event-Date 21-10-2020
State Telangana
Topic General
ఉంగరంలో 7,801 వజ్రాలతో గిన్నిస్‌రికార్డ్‌
guinness-world-record-with-7-801-diamonds-in-the-ring

కొట్టి శ్రీకాంత్‌ అనే నగల డిజైనర్‌ ఏకంగా 7,801 వజ్రాలతో ఉంగరాన్ని తీర్చిదిద్దారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36లోని ‘ది డైమండ్‌ స్టోర్‌'లో ఆ అరుదైన వజ్రాల ఉంగరాన్ని ప్రదర్శించారు. హిమాలయాల్లో అరుదుగా లభించే బ్రహ్మకమలం స్ఫూర్తితో ఈ ఉంగరాన్ని తయారుచేయించామని, ఇందుకు 11 నెలల సమయం పట్టిందని శ్రీకాంత్‌ తెలిపారు. సహజ సిద్ధమైన వజ్రాలను ఉపయోగించినట్టు చెప్పారు. ఆన్‌లైన్‌ వేలం ద్వారా ఉంగరాన్ని విక్రయిస్తామని, దక్షిణ భారతదేశంలో జ్యువెలరీ విభాగంలో గిన్నిస్‌బుక్‌ ఎక్కిన తొలిసంస్థ తమదేనని పేర్కొన్నారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.