Event-Date 21-10-2020
State International
Topic Awards And Honours
ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్
Largest coffee painting


4.5 కిలోల పనికిరాని కాఫీ పొడితో సౌదీ అరేబియా స్థాపకులైన కింగ్ అబ్దుల్ అజీజ్, షేక్ జైద్‌లను సౌదీ అరేబియాకి చెందిన ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి అనే మహిళా కళాకారిణి  చిత్రాలను గీశారు. ‘నసీజ్1’గా పిలుస్తున్న ఈ పెయింటింగ్‌ను గిన్నిస్ ప్రపంచ రికార్డు వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌గా నసీజ్1 నిలిచింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఏడు వస్త్రాల కాన్వాస్‌పై 220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెయింటింగ్‌ను వేశారు. 2015లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రియాద్‌లో 8,264 మంది మహిళలు కలిసి అతిపెద్ద హ్యూమన్ ఎవేర్నెస్ రిబ్బన్‌ను రూపొందించారని పేర్కొంది. కానీ ఒక సౌదీ మహిళ ఒంటరిగా గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. సౌదీ అరేబియా నుంచి గిన్నిస్ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి రికార్డు సాధించింది. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అక్టోబర్ 18న ప్రకటించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.