Event-Date 22-10-2020
State National
Topic General
ఐఐటీ మద్రాస్‌తో ఇండియన్ బ్యాంక్ జట్టు
Indian Bank team with IIT Madras

ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ స్టార్టప్ సంస్థలకు రుణాలు అందించేందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్ ఇన్‌క్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ)తో జట్టు కట్టింది. దీని ప్రకారం ఇండ్ స్ప్రింగ్ బోర్డ్ కార్యక్రమం కింద సాంకేతికత, నిధులపరంగా పటిష్టమైన స్టార్టప్ సంస్థల గురించి, వాటి వ్యాపార విధానం గురించి ఇండియన్ బ్యాంక్‌కు ఐఐటీఎంఐసీ వివరాలు ఇస్తుంది. ఈ సంస్థల వర్కింగ్ క్యాపిటల్ లేదా యంత్ర పరికరాల కొనుగోలు మొదలైన వాటికి రూ. 50 కోట్ల దాకా రుణాలను ఇండియన్ బ్యాంక్ అందిస్తుంది.
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.