Event-Date 22-10-2020
State Andhra Pradesh
Topic General
హస్తకళల కోసం వెబ్ పోర్టల్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం?
AP government launches web portal for handicrafts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు  ‘ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్’లు ప్రారంభించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 20న ముఖ్యమంత్రి  వీటిని ప్రారంభించారు. హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ-ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆప్కో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్లు పొందవచ్చు. లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు.
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.