Event-Date 22-10-2020
State International
Topic Sports And Games
క్రికెట్‌లో తొలి కొవిడ్‌ సబ్‌స్టిట్యూట్‌
nz-bowler-ben-lister-becomes-first-coronavirus-replacement-in-cricket

న్యూజిలాండ్‌ పేసర్‌   బెన్‌ లిస్టర్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి కరోనా వైరస్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా నిలిచాడు.  దేశవాళీ టోర్నీ ప్లంకెట్‌ షీల్డ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న  ఆల్‌రౌండర్‌ మార్క్‌ చాప్‌మన్‌ స్థానంలో లిస్టర్‌ ఆక్లాండ్‌  జట్టులోకి వచ్చాడు. చాప్‌మన్‌ కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోవడం కోసం వెళ్లడంతో  అతని స్థానంలో లిస్టర్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు.  సుదీర్ఘ ఫార్మాట్‌లో కొవిడ్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనలను ఐసీసీ గత జూన్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే.  ఆటగాళ్లు అనారోగ్యం బారినపడిన లేదా కోవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తే వాళ్ల స్థానంలో మరొక ఆటగాడిని తుది జట్టులోకి  తీసుకోవచ్చు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.