Event-Date 22-10-2020
State International
Topic Science And Technology
ఉల్కపై రాళ్లను సేకరించిన స్పేస్‌క్రాఫ్ట్
NASA spacecraft grabs sample of rocks from asteroid

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన ఒసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా బెన్నూ ఉల్కపై వాలి అక్కడ ఉపరితలం నుంచి రాళ్ల నమూనాలను సేకరించింది. ఈ రాళ్లకు చాలా పురాతన చరిత్ర ఉంది. మన సౌరవ్యవస్థ పుట్టుక దశ నాటి రాళ్లను తీసుకుని ఈ అంతరిక్ష నౌక తిరిగి రానుందని నాసా తెలిపింది. భూమికి 321 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్థరాయిడ్ బెన్నూ ఖగోళ స్వరూపాన్ని తెలిపే అత్యంత కీలకమైన ఉల్కగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. భూమిపైకి జీవన పరిణామం తలెత్తడానికి ఈ ఉల్క ప్రధాన కారకంగా మారి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. స్పేస్‌క్రాఫ్ట్ సేకరించిన ఈ నమూనా ప్రక్రియను టచ్ అండ్ గో(టాగ్)గా వ్యవహరిస్తున్నారు. అయితే ఉల్క రాళ్లు రప్పలను తీసుకుని ఈ స్పేస్‌క్రాఫ్ట్ నేలపైకి 2021 మార్చిలో దిగుతుంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.