Event-Date 01-03-2020
State International
Topic Biology Health Environment
ఆక్సిజన్‌ లేకుండానే బ్రతికే జీవి
scientists discovered first animal can lives without oxygen

ఆక్సిజన్‌ లేనిదే జీవుల మనుగడ లేదు అలాంటిది ఆక్సిజన్‌ లేకుండానే బ్రతికే జీవిని టెట్‌ ఏవీవ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు.  ఆ జీవి పేరు హెన్నెగుయా సాల్మినికోలా. ఈ జీవి 10 కణాల కంటే తక్కువగా ఉంటుంది మరియు  సాల్మన్‌ చేపల కండరాలల్లో పరాన్న జీవిగా నివసిస్తుంది. అత్యంత చిన్న జీవిగా గుర్తించారు. ఇజ్రాయిల్‌లోని టేల్‌ ఏవీవ్‌ యూనివర్శిటీ పరిశోధకులు సముద్ర భూగర్భంలో సాల్మన్‌ చేపల్లో ఈ జీవిని కనుగొన్నారు.  లైఫ్‌ సైన్స్‌, నేచురల్‌ హిస్టరీలోని జువాలజీ స్కూల్‌ ప్రొఫెసర్‌ డోరతి హుచోన్‌ ఆధ్వర్యంలో యూనివర్శిటీ పరిశోధకులు దీనిపై పరిశోధన చేశారు. హుచోన్‌ పరిశోధనలో ఇది శ్వాస లేకుండానే బ్రతికేస్తున్నట్లు వెల్లడైంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.