Event-Date 25-10-2020
State Telangana
Topic Science And Technology
విత్తన నిల్వకు సరికొత్త పద్ధతి కనుగొన్న శాస్త్రవేత్తలు
newest-method-seed-storage-iith-amazing-research

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీహెచ్‌) శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా నిల్వ చేసేందుకు సరికొత్త పదార్థం కనుగొన్నారు. ప్లాస్టిక్‌కు వేపనూనె జతచేసి నానో స్థాయి ప్లాస్టిక్‌ పదార్థం రూపొం దించారు. ఈ నానో ప్టాస్టిక్‌ పోగులతో తయారైన సంచుల్లో ఉంచిన విత్తనాలు 75 రోజుల తరువాత కూడా తాజాగానే ఉంటాయని ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంచుల్లో విత్తనాలు ఇదే కాలవ్యవధికి 70 శాతం మాత్రమే తాజాగా మిగులుతుండగా, కొత్త రకం సంచుల్లో ఇది 90 శాతం వరకూ ఉండటం విశేషం. వేపనూనెలోని నింబిన్, అజాడిరక్టిన్‌ వంటి ట్రిటెర్పినాయిడ్లు బూజును దరిచేరనివ్వవు. క్రిమికీటకాల ఎదుగుదలనూ అడ్డుకుంటాయి. వేపనూనె ద్వారా 200 రకాల కీటకాలను అడ్డుకోవచ్చు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.