Event-Date 25-10-2020
State National
Topic Persons In News
డైరెక్టర్ జనరల్ డెంటల్ సర్వీసెస్‌'గా నందకిషోర్ సాహూ
nandakishore-sahoo-has-taken-over-as-director-general-of-dental-services

డైరెక్టర్ జనరల్ డెంటల్ సర్వీసెస్‌, కల్నల్‌ కమాండెంట్‌ ఆఫ్‌ ఆర్మీ డెంటల్‌ కార్ప్స్‌'గా లెఫ్టినెంట్‌ జనరల్‌ నందకిషోర్ సాహూ బాధ్యతలు స్వీకరించారు.  కశ్మీర్‌ లోయలోని యూనిట్‌ కమాండ్‌, పశ్చిమ, మధ్య, దక్షిణ కమాండ్ల కమాండ్‌ అడ్వైజర్‌గా సేవలు అందించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ నందకిషోర్ సాహూ, కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఓరల్ ,మాక్సిల్లోఫేషియల్ సర్జరీ స్పెషాలిటీలో ముంబై విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. పుణెలోని సైనిక సాయుధ వైద్య కళాశాల, ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రుల్లో దంత విభాగం  అధిపతిగా ఆయన సేవలందించారు. తాను అందించిన సేవలకుగాను ఐదు పురస్కారాలతోపాటు విశిష్ట సేవా పతకాన్ని (వీఎస్‌ఎం) కూడా అందుకున్నారు

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.