Event-Date 25-10-2020
State National
Topic General
తొలిసారిగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు ఈ ఎస్ఐ సేవలు
esi-services-for-the-first-time-to-arunachal-pradesh

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇఎస్ఐ) ప‌థ‌కం కింద మ‌రింత మంది ఉద్యోగుల‌ను తీసుకురావాల‌న్న భార‌త ప్ర‌భుత్వ నిరంత‌ర కృషిలో భాగంగా ఇఎస్ఐ ప‌థ‌కాన్ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు తొలిసారి విస్త‌రించింది.  న‌వంబ‌ర్ 1 నుంచి ఈ సేవలు అమ‌లులోకి వ‌స్తాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఇఎస్ ఐ ప‌థ‌కం కింద పాపుమ్‌ప‌రే జిల్లా అధికారుల‌ను నోటిఫికేష‌న్ జారీ చేయ‌వ‌ల‌సిందిగా శుక్ర‌వారం ఉత్త‌‌ర్వులు జారీ చేసింది. ప‌ది అంత‌క‌న్నా ఎక్కువమంది వ్య‌క్తుల‌ను ఉద్యోగులుగా క‌లిగి ఉన్న పాపుమ్‌పరే జిల్లాలోని అన్ని ప‌రిశ్ర‌మ‌లూ ఇఎస్ ఐ చ‌ట్టం, 1948 కింద ప‌థ‌కం ప‌రిధిలోకి రావ‌డానికి అర్హులు అవుతారు. ప‌ని చేస్తున్న ఉద్యోగులు నెల‌కు రూ. 21,000 వ‌ర‌కు (దివ్యాంగుల‌కు రూ. 25,000) ఆర్జిస్తుంటే ఈ ప‌థ‌కం కింద ‌వారు అర్హులు అవుతారు.  భార‌త‌దేశంలో ఇఎస్ ఐ ప‌థ‌కం ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఒక న‌వీన్ సామాజిక భద్ర‌తా సంస్థ‌. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం కింద 3.49 కోట్ల ఉద్యోగ కుటుంబ యూనిట్లలోని 13.56 కోట్లమంది ల‌బ్ధిదారుల‌కు సాటిలేని న‌గ‌దు ప్ర‌యోజ‌నాల‌ను, స‌ర‌స‌మైన వైద్య సంర‌క్ష‌ణ‌ను అందిస్తున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.