Event-Date 25-10-2020
State National
Topic Persons In News
ప్రపంచ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా అపూర్వచంద్ర
Apoorva Chandra as President of the World Labor Organization

 కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ప్రపంచ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత్‌కు ఐఎల్‌వో అధ్యక్ష పదవి దక్కడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2021 జూన్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2020, నవంబర్‌లో జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అపూర్వచంద్ర ఇప్పటివరకు ఏడేళ్లపాటు కేంద్ర పెట్రోలియంశాఖలో పనిచేశారు. ఐఎల్‌వో ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్, డెరైక్టర్ జనరల్ ఎంపికలో పాలకమండలి కీలక పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్) ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య: 187

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.