Event-Date 25-10-2020
State National
Topic General
పార్లమెంటు నూతన భవన నిర్మాణం
Construction of a new building for Parliament

పార్లమెంటు నూతన భవన నిర్మాణం 2020, డిసెంబర్‌లో మొదలుపెట్టి 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపారు. భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు లోక్‌సభ సచివాలయ అధికారులు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, అర్కిటెక్ట్‌లు సభ్యులుగా స్పీకర్ ఓం బిర్లా ఒక కమిటీని నియమించారు. పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అక్టోబర్ 23న సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులు ఈ మేరకు వెల్లడించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.