Event-Date 25-10-2020
State Telangana
Topic Awards And Honours
‘జేమ్స్‌ డైసన్‌-2020’ పురస్కారం
The James Dyson Award 2020

దేశంలో కరెన్సీ మార్పు తర్వాత అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు హైదరాబాద్‌ యువకుడు పరిష్కారం చూపారు. పాత, కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు ‘దృష్టి’ పేరుతో రూ.5 ఖర్చుతో చిన్న పరికరాన్ని రూపొందించి ప్రఖ్యాత జేమ్స్‌ డైసన్‌-2020 అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు.హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లికి చెందిన లింగాల మణితేజ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) అహ్మదాబాద్‌లో డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి కరెన్సీ గుర్తింపులో అంధులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని దానికి పరిష్కారంగా తన మిత్రుడు మృదుల్‌ చిముల్వార్‌తో కలిసి ఈ పరికరాన్ని తయారు చేశారు.   

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.