ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్

ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్
  • ఉస్మా నియా 'ఆర్ట్స్ కళాశాల' భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది. 1939లో నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేదో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. ఇది పూర్తయ్యాక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ ను వ్యక్తులు, సంస్థలు వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుండదు. టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫొటోలను ముద్రించకూడదు. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబయిలోని హోటల్ తాజ్మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి మాత్రమే ఉండగా, దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి భవనంగా గుర్తింపు లభించనుంది.
  • 1939లో నిజాం VII మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించిన ఆర్ట్స్ కళాశాల భవనం ఇండో-సార్సెనిక్ తోరణాలతో అజంతా మరియు ఎల్లోరా శైలుల యొక్క అద్భుతమైన సమ్మేళనం. బెల్జియన్ ఆర్కిటెక్ట్ మోన్సియర్ జాస్పర్ రూపొందించిన ఈ గ్రానైట్ నిర్మాణం 164 గదులు మరియు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.