నాగాస్త్ర-1 డ్రోన్లు
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాగాస్త్ర-1 అనే అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందు బాటులోకి వచ్చాయి. ఈ ఆత్మాహుతి డ్రోన్లను మహారాష్ట్ర నాగుర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. మొత్తం 480 నాగాస్త్ర-1 లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. ఈ సంస్థ 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది.
- జీపీఎస్ ఆధారంగా పని చేసే నాగాస్త్ర-1 బరువు 9 కిలోలు. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.