నలుగురి వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం

నలుగురి వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం

బ్యాంకు ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కు నలుగురి వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం కలగనుంది. ఇందుకు అనుమతినిచ్చేలా బ్యాంకింగ్ చట్టం (సవరణ) బిల్లు-2024కు డిసెంబరు 3న లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతా దార్లకు ఒక్కరిని మాత్రమే నామినీగా ఎంపిక చేసుకునే వీలు ఉంది.