హైపర్ లూప్ టెక్నాలజీ
ఐఐటీ మద్రాస్, భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది.
410 మీటర్ల పొడవున్న ఈ ట్రాక్‌ను తైయూర్‌లోని ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్‌లో పరీక్షించేందుకు సిద్ధంగా ఉంది.
హైపర్‌లూప్ అనేది హై-స్పీడ్ రవాణా వ్యవస్థ, ఇక్కడ ప్రయాణీకుల పాడ్‌లు తక్కువ-పీడన ట్యూబ్‌ల ద్వారా ప్రయాణిస్తాయి, గాలి నిరోధకత మరియు రాపిడిని తగ్గించడం ద్వారా నమ్మశక్యం కాని వేగవంతమైన ప్రయాణ వేగాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
హైపర్ లూప్ టెక్నాలజీ అంటే
హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ.. దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇప్పుడి హైపర్ లూప్ ట్రాక్ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.