దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తు లకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డు-2024ను ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పొదిలి రాజశేఖరరాజు అందుకున్నారు.
డిసెంబర్ 6న ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన కార్యక్ర మంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజూషణ్ చౌధరి ఈ అవార్డును రాజశేఖరరాజుకు ప్రదానం చేశారు.
రాజు 17 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల రక్షణ, నిర్వహణ, రైతులకు అనువైన మార్పులు తీసుకురావడంలో విశే షంగా కృషి చేస్తున్నారు.
ఆయన ప్రణాళికలతో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో 50 లక్షల ఘనపు మీటర్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 2 లక్షల కుటుంబాలకు నీటి భద్రత లభించిందని అవార్డు కమిటీ పేర్కొంది.
రాజు 2022లో జాతీయ వాటర్ హీరో అవార్డుతో పాటు CSR ఇండియాస్ రెస్పాన్సిబుల్ లీడర్ పురస్కారాన్ని అందుకున్నారు.