NMDC లిమిటెడ్ డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం

NMDC లిమిటెడ్ డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం
  • ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ NMDC లిమిటెడ్ డైరెక్టర్(పర్సనల్)గా 1 మార్చి 2025న ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు.
  • కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ వయసు వచ్చే వరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.
  • ప్రస్తుతం NMDC కార్పొరేట్ కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
  • NMDCలో ఆమె 1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరారు. అదే సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదగడం విశేషం.
  • అంతేకాక ఒక మైనింగ్ సంస్థలో ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆమె పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్నారు.
  • NMDCలో నియామకాలు, పారిశ్రామిక సంబంధాలు, ఆరోగ్య సేవల విషయంలో చొరవ తీసుకొని ఎన్నో కొత్త విధానాలు అమలు చేశారు.