చంద్రుడిపై సేఫ్ గా ల్యాండైన బ్లూ ఘోస్ట్‌

చంద్రుడిపై సేఫ్ గా ల్యాండైన బ్లూ ఘోస్ట్‌
  • అమెరికాలోని టెక్సాస్ కు ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థ  2 మార్చి 2025న తమ బ్లూ ఘోస్ట్ లూనార్ ల్యాండర్‌ను చంద్రుడిపై విజయవంతంగా దింపి చరిత్ర సృష్టించింది. 
  • ఇది చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్. 
  • బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలంపై  సరైన స్థితిలో దించింది.
  • చంద్రుడిపై కూలిపోకుండా, పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది.
  • అది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల పరిధిలో ల్యాండ్‌ కానుంది.
  • అంతరిక్ష నౌక ల్యాండింగ్‌కు ముందు భూమి చుట్టూ మూడు లూప్‌లపై 2.8 మిలియన్ మైళ్లు ప్రయాణించింది
  • దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని కేప్‌కెనవరాల్‌ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.
  • ఎలాన్ మస్క్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌, బ్లూ ఘోస్ట్‌తో పాటు జపాన్‌కు చెందిన మరో ల్యాండర్‌ హకుటో ఆర్‌2 కూడా నింగిలోకి మోసుకెళ్లింది. 
  • బ్లూఘోస్ట్‌ ద్వారా చంద్రుడిపైకి 10 పరికరాలను పంపడానికి నాసా 101 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపుగా రూ.883.45 కోట్లు, వాటి తయారీకి 44 మిలియన్‌ డాలర్లు (రూ.385 కోట్లు) ఖర్చు చేసింది.
  • ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ ఘోస్ట్‌ 15 రోజులుపాటు ప్రయోగాలు చేయనుంది.
  • గతంలో ఐదు దేశాలు విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌లు చేశాయి - అప్పటి సోవియట్ యూనియన్, US, చైనా, భారతదేశం మరియు జపాన్.