RBI మాజీ గవర్నర్, ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
మూడేళ్ల పాటు ఆయన IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేయనున్నారు.
2016 నుంచి 2018 వరకు RBI గవర్న్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు. IMF ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
2016, సెప్టెంబర్ 4వ తేదీన ఆయన RBI 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. IMFకు సేవలు అందించడం ఉర్జిత్ పటేల్‌కు ఇది రెండోసారి.
1996-1997 మధ్య ఆయన IMF తరపున ఆర్బీఐకి పనిచేశారు. రుణాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పెన్షన్ నిధుల అప్‌డేట్, విదేశీ మార్కెట్ గురించి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు.
1998 నుంచి 2001 వరకు ఆర్థికశాఖలోని ఆర్థిక వ్యవహాల శాఖకు కన్సల్టెంట్‌గా చేశారు.